– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డి
– సూరారంలో ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ- బాలానగర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అప్పటినుంచి గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేశామని అందుకే మళ్ళీ ఓటు అడుగుతున్నామని టిఆర ్‌ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళ వారం రాత్రి మండల పరిధిలోని సూరారం గ్రామంలో ఆయన ఇంటింటి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఓటర్లను వేడు కున్నారు. రైతులకు .గహనీలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నా మన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని ఇది ఏ రాష్ట్రంలో లేదని కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలో నెంబర్ వన్ గా ముందుకు సాగుతుందన్నారు. రైతులకు భీమా పథకం పంట బీమా, గీతా కార్మికులకు, పెన్షన్లు వద్ధు లకు వితంతువులకు వికలాగులకు పెన్షన్లు ఇచ్చి ఆదు కుంటున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన అన్నారు. గ్రామాల నుండి గిరిజన తండాల వరకు వీటి రోడ్లు ఏర్పాటు చేశామని ఇంకా కొన్ని మిగిలిపోయిన తాండలకు బీటీ రోడ్లు నేర్పిస్తే ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. రైతులకు నేరుగా తాము పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల వద్దనే కొని వారి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామని ఆయన అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉందని జడ్చర్లను ఇంక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ వలన ప్రతి గ్రామంలో చెరువులలో కుంటలలో నీరు జలకలా అనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలో స్మశానవాటికలు ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. రైతులు సభలు సమావేశాలు సూచనలు సలహాలు చేసుకో వడానికి రైతు వేదిక భవనాలను నిర్మించామని ఆయన అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని ఆయన అన్నారు. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నామని ఓటర్లను వేడుకున్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని ఆయన అన్నారు. మండల పరిధిలోని సూరారం. గంగాధర్ పల్లి, మేడిగడ్డ కురువ గడ్డ తండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట మండల టిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.