నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలంలో వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం వేములవాడ పట్టణం లోని ఎస్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో వేములవాడ రూరల్ మండలం కి చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో రూరల్ ఎస్ ఐ మారుతీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించగా, వేములవాడ రూరల్ తహసీల్దార్.సుజాత,ఎం పి డి ఓ. శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.ఈ సందర్బంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో ఉన్న 16 గ్రామాల్లో మొత్తం 96 వినాయకులని ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగినదని, అట్టి అన్ని వినాయకులను జియో ట్యాగింగ్ చేసి ప్రతిరోజు బ్లూ కోల్ట్స్ , పెట్రో కార్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. వినాయక మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అగ్నిమాపక నిరోధ వస్తువులు పెట్టాలని వినాయకుల సంరక్షణ కొరకు ప్రతి ఒక్కరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ నెల 15, 16 తేదీలలో ఎక్కువ మొత్తంలో వినాయకుల నిమజ్జనం ఉన్నదని ఈ రోజులలో నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు, చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. వినాయక నిమజ్జన సమయంలో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు చెరువు వద్ద జాగ్రత్తలు వహించి దూరంగా ఉండాలని, పెద్ద పెద్ద వినాయకులు ఉన్నవారు ముందు రోజే రూట్ ను చూసుకొని ఆ రూట్ ప్రకారమే వెళ్లాలని, వినాయక శోభాయాత్రకు ఎలాంటి ఆటంకం కలిగినా వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. వినాయక మండపాల వద్ద మద్యం సేవించి ఆగడాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సి ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ శాఖల సిబ్బంది తోపాటు మండప నిర్వాహకులు తదితరులు ఉన్నారు.