మాందాపూర్ లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మాందాపూర్ గ్రామంలో గ్రామ యువత అధ్వర్యంలో ఇంటికి ఒక రక్త దాత నినాదంతో గురువారం స్వచ్ఛంద రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్చందంగా 54 మంది యువకులు రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నిజామాబాదు జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, సర్పంచ్ సులోచన, మాక్లూర్ చైర్మన్ గంగారాం, రవి తదితరులు పాల్గొన్నారు.