నవతెలంగాణ-నసరుల్లాబాద్ : బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బాన్సువాడ నియోజకవర్గ పెద్దాయన పోచారం శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నసురుల్లాబాద్ ఎంపీపీ పాల్త్య విఠల్, మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాయిపల్లి, ఆంకొల్ క్యాంప్ గ్రామంలో ఇంటింటికి టిఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు పెరిక శ్రీనివాస్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు ఇతర రాష్ట్రాలను ఇలాంటి పథకాలు లేవని అన్నారు. అలాగే గ్రామ నాయకులు కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. సీనియర్, జూనియర్ అనే భేదభావం లేకుండా అందర్నీ కలుపుకొని ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. గ్రామంలోని బూత్ లెవెల్ నాయకులు ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటు వేయించేలా చూడాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించారు అలాగే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాల్త్య విఠల్, జిల్లా కోఆప్షన్ నెంబర్ మాజీద్, మాజీ జెడ్పిటిసి సభ్యులు కిషోర్ యాదవ్ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి నాయకులు యేడే మోహన్, మసూద్, హైమద్ ,సాయిలు, రిహాన్, ఖలీల్, ఫాహీం, తదితరులు పాల్గొన్నారు.