నవతెలంగాణ- తిరుమలగిరి: ఇంటింట ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలోని కోక్య నాయక్ తండ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు మార్కెట్ డైరెక్టర్ యాకూబ్ నాయక్ లు తండాలోని ఓటర్లకు 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు తాగునీళ్ల కోసం పడిన కష్టాలను గుర్తు తెచ్చుకోవాలని, ఎవరికి ఓటు వేయాలని నిర్ణయం మీ చేతుల్లోనే ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే తండాలకు రోడ్లు, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు వాటర్ ట్యాంకులు వచ్చాయన్నారు. మంచిగా ఆలోచించి మన ఊరిని బాగు చేసిన గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుకే మరో మారు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనంతరం తండాలోని కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై వారి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొడ్డు సుజాత సైదులు, గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు రాజేందర్, మాజీ అధ్యక్షుడు దేవా, సురేందర్, దల్ప, మాజీ సర్పంచ్ యాకయ్య, పార్టీలో చేరిన వారు స్వామి, నవీన్, రాజు, రమేష్, భోజ్య, శీను, రాజేందర్, తదితరులు పార్టీలో చేరారు.