
నవతెలంగాణ – సిద్దిపేట: బహుజనుల రాజ్యం కోసం ఏనుగు గుర్తుకే ఓటేయాలని బీఎస్పీ అభ్యర్థి చక్రధర్ గౌడ్ ప్రజలను కోరారు. ఆదివారం నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో, పట్టణంలో తనకు ఓటేయాలని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు తనను గెలిపిస్తే బీమా సౌకర్యం కల్పిస్తానని అన్నారు. గతంలో కూడా గౌడ కులస్తులకు, ఇతర వర్గాలకు బీమా సౌకర్యం కల్పించానని, ఇప్పుడు గెలిస్తే మరింత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. బహుజన రాజ్యం రావాలంటే ఏనుగు గుర్తుకే ఓటు వేయాలని అన్నారు.