నవతెలంగాణా-మట్టెవాడ
వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాల్లో భాగంగామెప్మా ఆ ధ్వర్యంలో మంగళవారం వరంగల్ (తూర్పు) 10 6-నియోజకవర్గ పరిధి డివిజన్లలోని స్లమ్ ప్రాంతాల్లో ఓటరు చైతన్యంపై అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ నోడ ల్ అధికారి కోలా రాజేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. స్వీప్‌లో భాగంగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు భాగస్వామ్యాన్ని పెంచేందుకు నగరం లోని ఎస్‌ఆర్‌ఆర్ తోట, దేశాయిపేట ప్రాంతా ల్లో ఓటువేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజాస్వా మ్యంలో ఓటు ప్రాముఖ్యతపై స్థానిక ప్రజలకు ర్యాలీ లు చేపట్టి అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వ హించారు. ఈర్యాలీలో స్వయం సహాయక మహిళ బృం దాల సభ్యు రాళ్లతోపాటు స్థానిక మహిళలను, ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓటుప్రాధాన్యతను వివరించిన ఆయన మాట్లాడుతూ ఎస్విఈఈపి (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్-స్వీప్)- 2023లో భాగంగా ఓటరు ప్రచార రథంలో ఉంచబ డిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ల ద్వారా ఓటు వేయు విధానంతో పాటు వేయబడిన ఓటు ని ర్ధారణ వంటి అంశాల పై స్థానిక ఓటర్లకు అవగాహన కలిగించడం జరిగిందని తెలి పారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న స్థాని కులు, సిబ్బందిచే అధికారులు ఓటరు ప్ర తిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో టీఎంసీ రమేష్, సీవోలు సునీ త, రమ, ఆర్‌పిలు స్వ రూప, లావ ణ్య పాల్గొ న్నారు.