
18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నసురుల్లబాద్ తహసీల్దార్ రాజు తెలిపారు గురువారం మండల కేంద్రంలోని రైతు వేదిక ఏర్పాటుచేసిన బిఎల్ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ రాజు మాట్లాడుతూ.. మండలంలోని 17 గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వివిధ గ్రామాల్లో ఉన్న బియ్యం క్షేత్రస్థాయిలో జల్లి కొత్త ఓటర్లను నమోదు అయ్యేందుకు కృషి చేయాలి అన్నారు. ఒకటి అక్టోబర్ 2023 నాటికి యువతీ యువకులు 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా అర్హులైన నూతన ఓటర్లను గుర్తించి నమోదు చేయాలన్నారు. అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సలు వయసు నుండే యువతి, యువకులతో పాటు దివ్యాంగులు మరియు ట్రాన్స్జెండర్ లను ఫారం-6 ద్వారా ఓటర్లుగా నమోదుచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లకు వారి వివరాలలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించడం జరుగుతుందని, బిఎల్ఓ లు ఇంటింటి సర్వే ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని, చనిపోయిన వారి వివరాలను జాబితా నుండి తొలంగించాలని తెలిపారు, పోలింగ్ కేంద్రంలో బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది అందరు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో తుది ఓటరు జాబితా ప్రచురణకు ముందు ఒకటికి రెండు సార్లు ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలను బూత్ స్థాయి అధికారులు సరిచూసుకోవాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన. ఫారం 7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న దివ్యాంగ ఓటర్ల వివరాలు చిరునామా తో మ్యాప్ చేసి పెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో వారి కోసం వాహనాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, లాజికల్ ఎర్రర్స్ డెమోగ్రాఫిక్ ఎర్రర్స్ పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఎంపీఓ రాము, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.