అనారోగ్యంతో వీఆర్ఏ మృతి

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని తిరంగ పేట్ గ్రామానికి చెందిన విఅర్ఏ బాల్ రాజ్ 55 అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు,విఆర్ఎ లా సంఘం మండల అధ్యక్షులు చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న గురువారం తెలిపారు. బుదవారం రాత్రి బాల్ రాజ్ అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారని, గురువారం అంతక్రియలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మృతి విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి విఆర్ఎ ల సంఘం నుండి ఆర్థిక సాయం చేసినట్లు అయన వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. పరమశించిన వారిలో విఆర్ఏ సంఘం మండల ప్రతినిధులు బొడ్డు రవి, రాజ్ కుమార్, గంగాధర్, ఆసది సాయిలు, తోపాటు తదితరులు ఉన్నారు.