ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా (ఏఐ)లో రెండో దఫా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ప్రకటించారు. నాన్‌ ప్లయింగ్‌ సిబ్బందికి దీన్ని వర్తింపజేయనున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. 40 ఏండ్లు పైన కలిగిన వారు ఐదేండ్ల సర్వీసు కలిగిన వారు విఆర్‌ఎస్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. శాశ్వత జనరల్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటుగా నైపుణ్యం లేని కేటగిరీలకు చెందిన సిబ్బందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ప్రస్తుతం ఫ్లయింగ్‌, నాన్‌ ఫ్లయింగ్‌ కలిపి మొత్తం 11 వేల మంది ఎయిరిండియాలో పనిచేస్తున్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎఐ తెలిపింది. వీఆర్‌ఎస్‌కు 2,100 మంది అర్హులుగా ఉన్నారని పేర్కొంది.