
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల వేతనాలు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ అన్నారు. చలో హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమన్ని జయప్రదం చేయాలని శనివారం పట్టణంలోని పెర్కిట్ లో పోస్టర్ల ఆవిష్కరణ చేసినారు. ఐ ఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 29 – హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద జరిగె ప్రదర్శన ధర్నా కార్యక్రమన్ని జిల్లాలో గల బీడీ కార్మికులు పేద్ద ఎత్తున పాల్గొని విజవంతం చెయ్యాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు నరేంద్ర మోడీ తను అధికారం లోకి వస్తే ఫ్యాక్టరీలు పరిశ్రమలు పెట్టి ఈ దేశం లో వున్నా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తనన్న మాటలు భూటకమని విమర్శించారు అంతేకాకుండా యజమాన్యాలకు పెట్టుబడి దారులకు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చి అమలు పూనుకున్నాడని ఆరోపించారు ఈ నాలుగు లేబర్ కోళ్లు భారత కార్మిక వర్గానికి ఉరి తాళ్లు లాంటివని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయ్య బోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బీడీ కార్మికుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ జీ ఓ విడుదల చేయాలని కెసిఆర్ గారి ఇస్తానన్న జీవన భృతి బీడీ కార్మికులకు బీడీ కమిషన్ దారులకు ప్యాకర్స్ కు చాటా ర్స్ కు నెలసరి వేతన ఉద్యోగస్తులకు ఆంక్షలు లేని జీవనాభృతి ఇవ్వాలని రాజీనామా చేసిన కార్మికులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈనెల 29వ తేదీన హైదరాబాద్ లో గల ఇంద్ర పార్క్ వద్ద ప్రదర్శన ధర్నా కార్యక్రమానికి జిల్లాలో గల బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరరు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో పి జామున, రుకుంబాయి , డి దర్శిని, డి స్వరూప, బి చిన్నలక్ష్మి, డి అర్చన,, అనిత, తదితరులు పాల్గొన్నారు.