వరంగల్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌-2023

– సీఎంఆర్‌ ఆధ్వర్యంలో కోడం కన్వెన్షన్‌ లో బ్యూటీ పేజెంట్‌
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
మన వరంగల్‌లో సీఎంఆర్‌. ఆధ్వర్యంలో బ్యూటీ పేజెంట్‌ (ర్యాంప్‌ వాక్‌)ను కోడం కన్వెన్షన్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఘనంగా ప్రారంభించారు, ఈకార్యక్రమంలో మొదటగా భరత నాట్యం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం ర్యాంప్‌ వాక్‌ నిర్వహించారు, ఈర్యాంప్‌ వాక్‌ లో వరంగల్‌ పట్టణంలో ఉన్న అనేకమంది చిన్నారులు తమ తమ స్టైల్లో ర్యాంప్‌ వాక్‌ చేసి తమ ప్రతిభను చూపించారు. తరువాత వరంగల్‌ యువత తమ తమ స్టైల్లో వినూత్నంగా ర్యాంప్‌ వాక్‌ చేసి ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ అనూష, డాక్టర్‌ శృతిలు ముఖ్య అతిథులుగా హాజరై జడ్జిమెంటు నిర్వహించారు. సి.ఎం.ఆర్‌. ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించిన ఈ ఫ్యాషన్‌ ర్యాంప్‌ వాక్‌ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, వరంగల్‌ ఫ్యాషన్‌ ప్రియులు తమ ప్రతిభను చూపించుకోవటానికి ఇది ప్రత్యేక వేదికగా నిలిచిందనడంలో సందేహం లేదు, యువత తమ తమ స్టైల్లో ర్యాంప్‌ వాక్‌ చేసి తమ ప్రతిభను చూపించి మిస్టర్‌ సి.ఎం.ఆర్‌, మిస్‌ సి.ఎం.ఆర్‌, సి.ఎం.ఆర్‌ ప్రిన్స్‌, సి.ఎం.ఆర్‌ ప్రిన్సెస్‌ టైటిల్స్‌ గెలుచుకున్నారు.ఈ ఫ్యాషన్‌ షోలో గెలుపొందిన విజేతలకు సి.ఎం.ఆర్‌. వారు మొదటి బహుమతి రూ.20,000 రెండవ బహుమతి రూ.10,000, మూడవ బహుమతి రూ.6,000 ఇవ్వటం జరిగినది. ర్యాంప్‌ వాక్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేశారు.