వార్డు సభ్యులు ఇక్బాల్ కూతురు పెళ్లికి హాజరైన ఎంపీ ,ఎమ్మెల్యే

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 14వ వార్డు సభ్యులైన ఇక్బాల్ కూతురు పెళ్లి మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఇట్టి పెళ్లి శుభ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హాజరయ్యారు. తమ పిలుపుకు మన్నించి కూతురు పెళ్లి హాజరైన ఎంపీ ఎమ్మెల్యేలకు ఇక్బాల్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యేల వెంట స్థానిక సర్పంచ్ సురేష్ ఉప సర్పంచ్ విట్టల్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ బండి వార్ విజయ్ బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.