నవతెలంగాణ-హసన్‌పర్తి
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలం గాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రేస్ అధినేత్రి సోనియాగాంధీకి వర్దన్న పేట నియొజకవర్గ ఎమ్మెల్యే స్థానా న్ని బహుమతిగా ఇవ్వాలని హన్మ కొండ, హసన్‌పర్తి బ్లాక్ కాంగ్రే స్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి తిరుపతి ప్రజలను కోరారు. మండలంలోని అనంత సాగర్‌లో కాంగ్రేస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్.నాగరాజును గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రేస్‌ను గెలిపిస్తే తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్నవారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బండ చంటిరెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు వట్టె శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ పార్టి అధ్యక్షుడు కుమార్‌యాదవ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రామంచ దయాకర్, నాయకులు అంబాల సమ్మయ్య, లక్ష్మారెడ్డి, భిక్షపతి, రమేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రశాంత్, బండ మహేందర్ రెడ్డి, విఘ్నేష్, తదితరులు పాల్గొన్నారు.
గ్యారెంటీ పథకాలే కాంగ్రెస్ విజయానికి సోపానాలు
పర్వతగిరి : త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పొందుపరిచిన ఆరు గ్యారెంటీ పథకాలే విజయానికి సోపానాలు అని పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ అన్నారు.మండల కేంద్రంలో ఎన్నికల కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం మండలం లోని రోల్లకల్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు వడ్లకొండ ఎంపీటీసీ అత్తి రేవతి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మంగ్య నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం బాగంగా లో జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు,మండల పార్టీ అధ్యక్షులు జాటో శ్రీనివాస్ నాయక్ వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీలు నాయక్, గంగాధర్ రావు, చీదురు కిష్టయ్య, కిషన్ నాయక్, కుసం రామచందర్, వంగాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.