ఐపిఎల్‌-2023 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా సీనియర్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు మరోసారి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా ఉన్న వార్నర్‌.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. ఆ ఫ్రాంచైజీ ట్విటర్‌ వేదికగా.. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడడం, ఐపిఎల్‌ సీజన్‌కు అందుబాటులో ఉండడం కష్టమైన నేపథ్యంలో ముందే కెప్టెన్‌ ఎంపికను పూర్తి చేసినట్లు పేర్కొంది. ఇక వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ వ్యవహరించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. 2022 సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్‌ ఐదు అర్ధసెంచరీలతో సహా 150.52 యావరేజ్‌తో 432పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ జట్టు తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 1న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.