– వైఎస్‌ఆర్ టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ఒక్క ఎకరమైనా తడిసిందా? అని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ లో ఏ ఒక్కరి దూప తీరలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ స్విచ్ వేస్తేనే పాలమూరు పచ్చబడ్డదా? అని ప్రశ్నించారు. పూర్తిగాని ప్రాజెక్టుతో ఎన్నికల రాజకీయం చేయొద్దని హితవు పలికారు. ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. మోడీతో డ్యూయేట్లు పాడుకుంటున్నప్పుడు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేక పోయారో సమాధానం చెప్పాలని నిలదీశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రంపై ఒక్క రోజైనా కొట్లాడారా? అని ప్రశ్నించారు.