అభివృద్ధిని చూసి ఓటు వేయండి

– రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వీ.శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ- హన్వాడ
గడచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ క్రీడా శాఖ మంత్రి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం టంకర గుడి మల్కాపూర్‌ రామ్‌ నాయక్‌ తండా గ్రా మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచా రానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 50 ఏళ్లు పాలించిన ఎలాంటి అభివద్ధి చేశారు ప్రజలకు తెలుసని అన్నారు టిఆర్‌ఎస్కు ఓటు ఎందుకు వేయాలను వివరించి చెప్పారు 200 ఉన్న పెన్షన్‌ రెండు వేలకు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌దేనని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.5000 నుంచి 16 వేలకు పెంచిందన్నారు. కళ్యాణ లక్ష్మి ,షాదీముబారక్‌ వంటి పథకాలను తీసుకొచ్చి పేదల బతుకుల్లో వెలుగులు నింపారన్నారు. పెళ్లిళ్లకు తక్షణ సహాయం అందించా మనీ అన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించి ఎంతోమందికి ఆసరా నిలిచామని అన్నారు. విక లాం గులు, ఆసరా పింఛన్లు పెంచి పేదలకు అం డగా నిలిచారన్నారు. అభివద్ధి చేసిన తమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ఎన్నికల కోసం కాంగ్రెస్‌, బీజే పీలు కల్లబొల్లి మాటలు చెప్పి నవంబర్‌ 30 తర్వాత ప్రజ లకు ఎవరూ కనిపించరన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మిమ్మల్ని గుండెల పెట్టుకొని చూసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీ చంద్రశేఖర్‌ , ఎం పీపీ బాలరాజ్‌, జెడ్పీటీసీ విజయనిర్మల ,రమణారెడ్డి, నాయకులు కొండ లక్ష్మయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌ కావాలి వెంకటయ్య , వైస్‌ చైర్మన్‌ కష్ణయ్య గౌడ్‌ , హరిచంద్ర నాయక్‌ , మాజీ జెడ్పీటీసీ నరేందర్‌ , మండల అధ్యక్షుడు కర్ణాకర్‌గౌడ్‌ ,సర్పంచులు బాలా గౌడ్‌ , అచ్చన్న, మంగ నాయక్‌, జంబులయ్య తదితరులు పాల్గొన్నారు.