– ఎస్జీటీయూకు విద్యాశాఖ సంచాలకుల హామీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్జీటీల సమస్యలను పరిష్కరించాలని ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరికెల వెంకటేశం కోరారు. ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ కార్యక్రమం బడ్జెట్‌ను ఉన్నతి శిక్షణతో సమానంగా ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేనను మంగళవారం హైదరాబాద్‌లో వారు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాదిలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేయాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయుల సర్దుబాటును కేవలం ప్రాథమిక పాఠశాలల్లోనే చేయాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక విషయంలో ఎస్జీటీలను తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక పాఠశాలల్లో సర్వీసు పర్సన్లను నెలలోపు నియమిస్తామంటూ ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఎన్ బడ్జెట్‌కు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శితో సంప్రదిస్తామంటూ ఆమె వివరించారని పేర్కొన్నారు. సీఎం ఆమోదం పొందగానే పీఎస్‌హెచ్‌ఎం పోస్టులను మంజూరు చేస్తామన్నారని తెలిపారు.