– ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
బుదాపెస్ట్ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్లు వరుసగా రెండో రోజు నిరాశపరి చారు. ఆదివారం పురుషుల 400మీటర్ల హార్డిల్స్‌లో సంతోష్ కుమార్ హీట్స్‌లో, హైజంప్‌లో సర్వేశ్ అనిల్ అర్హత రౌండ్ నుంచి నిష్క్రమించారు. మూడో హీట్‌లో పోటీపడిన సంతోష్ కుమార్ 50.46 సెకండ్ల టైమింగ్‌తో ఏడో స్థానంలో నిలిచి సెమీస్‌కు దూరమయ్యాడు. పురుషుల హైజంప్‌లో మూడు ప్రయత్నాల్లోనూ 2.25 మీటర్ల జంప్ చేయటంలో తేలిపోయిన అనిల్ గ్రూప్-బిలో11వ, ఓవరాల్‌గా 20వ స్థానంలో నిలిచాడు.