– ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు
నవతెలంగాణ -కంటేశ్వర్
జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ, నిజామాబాద్ కార్యాలము ద్వారా వయో వృద్దుల సంరక్షణ పోషణ నిర్వాహణ చట్టం, 2007 అమలుకై జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయబడుచున్నది అని జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ, నిజామాబాద్ ఎస్.కే. రసూల్ బీ గురువారం తెలిపారు. కావున ఇట్టి కమిటీ నందు ముగ్గురు సభ్యులను (ముగ్గిరిలో ఒకరు మహిళ ఉండవలెను) మెంబర్లు గా ఎంపిక చేయుటకు గాను సీనియర్ సిటిజన్ల సంక్షేమ రంగంలో సేవలందిస్తున్న ఎన్జిఓలు/ నిపుణులు/ కార్యకర్తల నుండి ముగ్గురు సభ్యులను (ముగ్గిరిలో ఒకరు మహిళ ఉండవలెను) ప్రముఖ వయో వృద్దుల నుండి ప్రతిపాదనలు కోరబడుచున్నవి. కావున జిల్లాలో గల సీనియర్ సిటిజన్ ఫోరం లకు, అసోసియేషన్ లకు, సీనియర్ సిటిజన్ సంస్థలకు, ఎన్.జి.ఓ.లకు, నిపుణులు, కార్యకర్తలకు మరియు ప్రముఖ వయో వృద్దులకు తెలియజేయునదేమనగా వయో వృద్దుల సంరక్షణ పోషణ మరియు నిర్వాహణ చట్టం, 2007 అమలుకై జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబోయే కమిటీ నందు సభ్యులుగా ఉండుటకు గాను తమ యొక్క ప్రతిపాదనలను సంబందిత ధృవపత్రములతో జిల్లా సంక్షేమ అధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలము, ఐ.డి.ఓ.సి., కొత్త కలేక్తరేట్, రూం.నం. 17 నందు అన్ని కార్యాలయ పని వేళలలో తేది: 25-08-2023 లోగా అందజేయగలరని తెలియజేశారు.