నవతెలంగాణ- నిజాంసాగర్: మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో తోట లక్ష్మీ కాంతారావు ఎమ్మెల్యేగా గెలిచినందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ తోట లక్ష్మీ కాంతారావు గెలుపే లక్ష్యంగా పనిచేశాం కాబట్టే మా ఎమ్మెల్యేను గెలిపించుకున్నామని వాళ్లు అన్నారు. ఇన్ని రోజులు దొంగల పాలన చేశారని వాళ్లు అన్నారు ఎంతో అవినీతికి పాల్పడ్డారని వాళ్లు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇంటిమీదికి బీఆర్ఎస్ కార్యకర్తలను పంపి కొట్టించడం చేశారని వాళ్లు పేర్కొన్నారు ఎవరైతే ఎన్ని చేశారు. వాళ్లందరికీ తిరిగి ఇస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. తోట లక్ష్మీకాంతరావు హయాంలో జుక్కల్ నియోజకవర్గాన్ని దేశం మంతా ఇటు వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తారని వాళ్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ది హనుమాన్లు, బింగి శేఖర్, బుడమే మైసయ్య, సాకలి ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.