4న జరిగే లింగయత్‌ ర్యాలీని వ్యతిరేకిస్తున్నాం

నవతెలంగాణ-బంజారాహిల్స్‌
వీరశైవ లింగాయత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజి గూడ ప్రెస్‌ కబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యక్షులు మస్తాన్‌ అశోక్‌, మఠాధిపతులు పీఠాధిప తులు పాల్గొని ఈనెల 4వ తేదీన జరిగే లింగాయత్‌ ర్యాలీని వ్యతిరే కించాలనీ, వీరశైవ లింగాయ తులు ఎవరూ ఆ ర్యాలీలో పాల్గొనవద్దని పిలుపునిచ్చారు. అనంతరం వారు మాట్లా డుతూ సాంస్కతులు ఒక్కటే ఆచారాలు వేరైనప్పటికీ కలిసి ఉందామని చెప్పి రాజకీయ లబ్ది కోసం విడగొట్టే ప్రక్రియ చేపడుతున్న ఈ ర్యాలీ ఉద్దేశాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనవద్దని వీరశైవ లింగాయ తులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వీరశైవులు అందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పటేల్‌ సహకారం గొప్పదని కొనియాడుతూ వీటిని విచ్చిన్నం చేయడానికి మహారాష్ట్ర కర్ణాటక లింగా యతులను ఇక్కడ కలిపి ఓసీలో ఉన్నవారు ఓబీసీలో ఉన్న తమను విచ్చినం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓబీసీ లింగాయత్‌ ర్యాలీ అంటే తాము పాల్గొంటామని అలా ర్యాలీకి నామకరణం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. లింగాయత్‌ అధ్యక్షులు ఈశ్వరప్ప శంకర్పటేళ్లు ఈ సవాల్‌ ను స్వీకరించి నేటి రాత్రి 12 గంటల వరకు తమకు సమాధానం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బసవ సంఘం అధ్యక్షులు ఈశ్వర ప్రసాద్‌, మహిళా అధ్యక్షురాలు రుద్రమదేవి, దిగంబర్‌ మఠాధి పతులు పీఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు.