అక్రమ అరెస్టులను కనిస్తున్నాం..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని వివిధ రాజకీయ నాయకుల అక్రమ అరెస్టులను కండిస్తున్నమని అఖిల పక్ష నాయకులు డిమాండు చేశారు. బుదవారం మండలంలోని అఖిలపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంపై మండి పడ్డారు. జిల్లా కేంద్రంలో మంత్రి కెటిఆర్ పర్యటన అడ్డుకుంటారా నే ఆలోచనతో వివిధ పార్టీ నాయకులను, గ్రామ పంచాయతీ కార్మికులను ముందస్తుగా అరెస్ట్ చేయడంపై వారు రాష్ట్ర ప్రభుత్వంపై మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొండ గంగాధర్, న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు రవి ప్రసాద్, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.