చదివాను నేను
ప్రపంచాన్ని శాసిస్తున్న
కార్పొరేట్ల గురించి
ప్రభుత్వ నిర్మాణములోనూ
రాజకీయాలను శాసించుటలోనూ
వీరి అదశ్య పాత్ర గురించి
ప్రపంచ వ్యాప్త మేధావి వర్గాన్ని
పోటీ పరీక్షలతో ఆర్థికాలతో
ఆకర్షిస్తూ అట్టిపెట్టుకుంటూ
రోజింత శక్తివంతం అవుతూ
తమ వ్యూహాలతో దేశాలను నిర్దేశిస్తూ
అన్ని రంగాలను శాసిస్తూ
సామాజిక ఆలోచనలను
సైతం ప్రభావితం చేస్తూ
జనావాసాన్ని సాంకేతిక
విజ్ఞానం పరికరాల వైపు
దష్టిని ఆకర్షిస్తూ
అట్టి పెట్టుకుంటూ
జనుల మానసిక శారీరక
రుగ్మతలకు కారణమవుతూ
వాటికిను విరుగుడు
మందును కనిపెడుతూ
అనునిత్యం అంతర్జాల
అంతర్వలయములో
జనులను నివసించేలా బంధిస్తూ
వ్యాపార వాణిజ్యలను
ఆర్థికాఅభివద్ధిని సాకుగా చూపుతూ
విశ్వాన్నంత వారి పరిపాలన
పద్మవ్యూహంలో బంధిస్తూ
విలువలకు తలోదకాలు ఇస్తూ
నిరంతర భేరసారాలతో
పెను వాతావరణ మార్పులతో
ఆర్థిక మాంధ్యాలతో
అసమతుల్యాలను పెంచిపోస్తూ
జనన మరణాలను నియంత్రిస్తూ
మేమంటే ప్రపంచం
ప్రపంచం అంటే మేము
అనే తారాస్థాయికి చేరుకొని
విశ్వానంతటిని నిరంతర
అనిశ్చితితి లోనికి నెట్టిన
మన్నిక పేరెన్నిక గనినవి నేడు
– డాక్టర్ మైలవరం చంద్రశేఖర్