నవ తెలంగాణ- ఆర్మూర్: బడుగు బలహీన పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలో గల పెర్కిట్ ఆదివాసి నాయక పోడు సేవా సంఘ భవనానికి భూమి పూజ చేసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కుల సంఘాల అభివృద్ధికి పాటుపడుతున్నామని, మరో మారు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్న, టిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ పెంట భోజ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లూర్ సాయన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లోళం గంగాధర్, జిల్లా కోశాధికారి శాణం పవన్, జిల్లా ఉపాధ్యక్షుడు పెర్కిట్ మూడ అశోక్, జిల్లా ముఖ్య సలహాదారుడు ఖానాపూర్ సర్పంచ్ సింగిరెడ్డి మోహన్, అంధపూర్ సర్పంచ్ పుట్ట శ్రీనివాస్, జిల్లా మండల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి చేపూర్ మేడిపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.