మ‌న‌లోని బ‌లాన్ని మ‌న‌మే గుర్తించాలి

We have to find our own strengthమనలోని భావాలను అదుపు చేసుకోవడం అంత సులభం కాదు. అందునా మహిళలు అనేక బాధ్యతల్లో ఉంటూ మల్టీటాస్కింగ్‌ చేస్తుంటారు. ఎవరైనా చిన్న మాట అన్నా భరించలేక కుంగిపోతుంటారు. నేను దేనికీ పనికి రానేమో అని బాధపడుతుంటారు. దాంతో మనలోని బలాలను మనం మర్చిపోతాము. ఈ సమాజంలో మహిళను చిన్నచూపు చూడటం సాధారణ విషయంగా మారిపోయింది. అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనమేంటో నిరూపించుకోగలం. అనేక విజయాలు సాధించగలం. అయితే ఇదంతా మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు. దీని కోసం కొంత సాధన చేయాలి. అదెలాగో తెలుసుకుందాం…
మన జీవితంలో ఎన్నో అవాంఛనీయ సందర్భాలను నివారించడానికి, సత్సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఎమోషనల్‌ రెగ్యులేషన్‌ అతి ముఖ్యం, అత్యవసరం. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజన్స్‌ ఊపందుకుంటున్న ఈ రోజుల్లో మానవత్వం నిలబడాలన్నా మానవ సంబంధాలు నిలబడాలన్నా ఎమోషనల్‌ ఇంటెలిజన్స్‌ చాలా చాలా అవసరం. ఎమోషనల్‌ రెగ్యులేషన్‌ అంటే మనం హై లేదా లో ఎమోషనల్‌ స్టేట్‌లో ఉన్నప్పుడు కూడా మాట జారకుండా, రియాక్ట్‌ అవ్వకుండా రెస్పాండ్‌ అవ్వడం.
అద్భుతాలు సృష్టించవచ్చు
ఒక వ్యక్తి తరచుగా లో ఎమోషన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవుతున్నట్లైతే వారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని బయట పడే మార్గాలను తెలుసుకొని ఆచరిస్తే వ్యసనాలకు బానిస కాకుండా ఉండగలుగుతారు. ఉదాహరణకు లో ఎమోషన్స్‌ అనగా బాధ, దుఖం, కోపం, అసూయ, తమ మీద తమకు అసహ్యం, ఒంటరితనం ఇటువంటి ఎమోషన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ అవుతునప్పుడు వాటిని అర్థం చేసుకొని, రెగ్యులేషన్‌ చేసుకోవడానికి, బయట పడటానికి కొన్ని అలవాట్లు, చిట్కాలు తెలుసుకోవడం అవసరం. ఉదాహరణకు మీకు ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్‌ లేదా టాస్క్‌ లేదా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు చాలా ఆందోళనకు, ఒత్తిడికి, భయానికి గురవుతారు. అలాంటప్పుడు అప్పటి వరకు మీరు సాధించినవి, ఎదుర్కొ న్నవి అన్నీ మరిచిపోయి చాలా భయపడి నేను ఈ పని చేయగలనా లేదా అని సందిగ్ధంలో పడిపోతారు. దీనినే ‘హనుమాన్‌ మోడ్‌’ అంటాము. మనందరికి తెలుసు హనుమంతుడికి తన బలం తనకు తెలీదని. సరిగ్గా అలాంటప్పుడే జాంజవంతుడు హనుమం తుడికి తన బలమేమిటో తనకు తెలియ జేశాడని పెద్దలు చెబుతుంటారు. అప్పుడు హనుమంతుడు మహాబలిగా మారి ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. అలాగే మనం కూడా కష్టతర మైన పరిస్థితులను ఎదుర్కొనపుడు మన మీద మనకున్న నమ్మకం కోల్పోయి భయానికి గురయ్యి ధైర్యాన్ని కోల్పోవడం సహజం.
ఈ చిట్కాతో…
మనకు తెలియని విషయం ఏమిటంటే మనకు మనమే మన జీవితంలో జాంబవంతుడిని సృష్టించుకోవచ్చు. అవును నిజమండీ! అదెలాగంటారే. అదే ఈ చిట్కా ద్వారా. ఒక పేపరు తీసుకోండి, లేదా మోబైల్‌లో నోట్‌ప్యాడ్‌ తీసుకోండి. ఇందులో రెండు కాలమ్స్‌ పర్సనల్‌, ప్రొఫెషనల్‌ అని పెట్టండి. రెండు రోస్‌ పెట్టండి. చిన్నతనం నుండి ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలు, పొందిన మెప్పులు, తెచ్చుకున్న గుర్తింపులు, అవార్డులు అన్నీ చిన్నవి, పెద్దవి అని చూడకుండా అన్నీ రాయండి (పర్సనల్‌ లైఫ్‌లో, ప్రొఫెషనల్‌ లైఫ్‌లో). మీకు ఎప్పుడు కష్టమైన పరిస్థితి ఎదురైనా వెంటనే పర్సులో నుంచి ఆ పేపరు తీసి లేదా మొబైల్‌లోని నోట్‌పాడ్‌ తీసి అవన్నీ చదవండి. మెల్లగా శ్వాస తీసుకొని ఈ aaffirmation చెప్పుకోండి. . I am one of the best I, deserve the best. I can do it for sure, why cant I do it అంతే ఒక మ్యాజిక్‌ జరిగినట్టు మీ భయం తగ్గి మీరు కొత్తగా నమ్మకం, ధైర్యం పొందుతారు. విజయం సాధిస్తారు.
కార్యసాధకులు కండి
మీ జీవితంలో మీ జాంబవంతుడిని మీరే సృష్టించుకోండి, ఉపయోగించుకోండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత్రి ూబఝఅ జీaటటవతీర రాసిన Feel the fear And do it AnyWay అనే పుస్తకం గురించి మాట్లాడాలి. ఇది బుక్‌ టైటిల్‌ అయినా ఇదే ఒక పవర్‌ఫుల్‌ స్టేట్‌మెంట్‌. మన జీవితంలో భయపడడం సర్వసాధారణం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో భయం వేస్తూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి అనగా మీరు హనుమాన్‌ మోడ్‌లోకి వెళ్ళారని గుర్తించి జాంబవంతుడి చిట్కాను ఉపయోగించి ధైర్యంగా కార్యసాధకులు కండి.  Feel the Fear And Do it AnyWay. . రాబోయే వారాల్లో మనలోని నెగిటివ్‌ ఎమోషన్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా రెగ్యులేట్‌ చేసుకోవాలో మరింత తెలుసుకుందాం. ఇక సెలవు మరి.Wishing you all a healthier and happies life.
Dr.Prathusha. Nerella
MD( General Medicine)
CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician
Positive Psychologist certified Nutritionist
Diabetes And Lifestyle Expert
Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach.
Ph: 8897684912/040-49950314