– శాట్స్ చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్
– డక్కన్ క్లబ్ ఎలైట్ చెస్ పోటీలు షురూ
హైదరాబాద్ : ప్రపంచ చెస్‌లో అతి త్వరలోనే భారత్ ఆధిపత్యం చెలాయించేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచ చెస్‌ను టీమ్ ఇండియా శాసించే తరుణంలో.. తెలంగాణ ముద్ర ప్రస్ఫుటంగా ఉండేలా ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని డక్కన్ క్లబ్ ఎలైట్ చెస్ పోటీలను రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ యాదవ్‌తో కలిసి ప్రారంభించిన ఆంజనేయ గౌడ్.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన టాప్ చెస్ మాస్టర్లు ఒక వేదికపై పోటీపడటంతో ఉత్తమ ప్రదర్భనకు ఆస్కారం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించేందుకు డక్కన్ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని డీజీపీ అంజనీకుమార్ యాదవ్ అన్నారు. రెండు రోజుల ఎలైట్ చెస్ పోటీల ఆరంభం సందర్భంగా శాట్స్ చైర్మెన్, డీజీపీ చెస్ ఆడుతూ క్రీడాకారులను ఉత్తేజపరిచారు.