– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
– ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమైన గండిగూడెం మత్స్యకారులు
నవతెలంగాణ-అమీన్‌పూర్
కలుషిత జలాలతో నష్టపోయిన గండిగూడెం మత్స్యకా రులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని పటాన్చెరు శాసన సభ్యుడు మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా అమీన్‌పూర్ మండలం గండిగ ూడెం గ్రామ చెరువులో వివిధ పరిశ్రమలకు సంబంధించిన కలుషిత జలాలు చెరువులో కలిసి భారీ స్థాయిలో మత్స్య సంపద మృత్యువాత పడింది. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలంటూ చెరువుకు సంబంధించిన మత్స్యకారులు ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గతంలోనూ కలుషిత జలాల మూలంగా నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వపరంగా ఆదుకోవడంతో పాటు కలుషిత జలాలకు కారమైన పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించి కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం అందించడం జరిగిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కలుషిత జలాలు చెరువులో కలవకుండా పరిశ్రమల్లో విధిగా కలుషిత జలాల శుద్ధికరణ ప్లాట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడంతోపాటు, పరిశ్రమలకు ప్రభుత్వపరంగా నోటీసులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మత్స్య సహకార సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.