జహీరాబాద్‌ వైపు.. సీఎం కుటుంబం చూపు

– చకచకా మారిపోతున్న జహీరాబాద్‌ రాజకీయాలు
– ప్రతిపక్షం లేకుండా చేసిన అధికార పక్షం
నవతెలంగాణ-జహీరాబాద్‌
జహీరాబాద్‌ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం ప్రత్యేక దష్టి పెట్టినట్టు తెలుస్తోంది. జహీరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల్లో ఏ ఒక్క అభ్యర్థి లేకుండా చేస్తామని గతంలో బహిరంగంగా ప్రకటించి.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అందులో భాగం గా ముఖ్యమైన నాయకులందరినీ బీఆర్‌ఎస్‌లో చేర్చుకు ంటున్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం పై ప్రత్యేక దష్టి పెట్టిన మంత్రి హరీశ్‌రావు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతిపక్ష పార్టీలో కీలకంగా ఉన్న నాయక ులందరితో చర్చలు జరిపి.. బీఆర్‌ఎస్‌ కండువా కప్పుత ున్నారు. ఇప్పటి క మాజీ టీపీసీసీ నాయకులు వై నరోత్తం ముఖ్యమంత్రి సమక్షంలోపార్టీలో చేరిన విషయం తెలిసిందే. సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్‌ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారితో పాటు ప్రస్తుతం వివిధ మండలాల్లోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు బీఆర్‌ఎస్‌ నాయకులతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
కోహిర్‌ మండలానికి చెందిన కీలక నాయకుడు, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధి కూడా బీఆర్‌ఎస్‌ నాయకులతో టచ్‌లో ఉండి కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఝరాసంగం మండలానికి చెందిన మాజీ జడ్పీ చైర్మెన్‌ కుటుంబ సభ్యులు కూడా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మంత్రి సమక్షంలో చర్చలు జరిగిన ట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. న్యాల్కల్‌, మొగుడ ంపల్లి, జహీరాబాద్‌ మండలాల్లోని కీలక నాయకులు సైతం మంత్రి హరీశ్‌రావుతో టచ్‌లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొగుడంపల్లి మండ లంలో ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నందన ఆ మండలానికి చెందిన గిరిజన కీలక నాయకుడిని మంత్రి హరీశ్‌ రావు తన వద్దకు పిలుచుకొని నామినేటెడ్‌ పోస్టులు కేటాయించారు. స్థానిక నాయకల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అధిష్టానం గ్రామీణ స్థాయి నాయకు లకు సైతం టచ్‌లో ఉన్నట్లు తెలు స్తోంది. జహీరా బాద్‌, నారా యణఖేడ్‌ నియోజ కవర్గాల్లో అధికార పార్టీలో ఏ విధమైన గ్రూపులు లేకుండా సమన్వయ పరచడం లో మంత్రి హరీశ్‌ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర ప్రతిపక్ష నాయకు లకు లభించని ముఖ్యమంత్రి అపాయిం ట్‌మెంట్‌ జహీరాబ ాద్‌ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులకు నేరుగా లభిస్తుందంటే.. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రతిపక్ష నాయకుల పై ఏ స్థాయి దష్టి పెట్టారు ఇట్టే అర్థమవుతుంది.
జహీరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టికెట్‌ ఆశిస్తున్న నరోత్తం, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్‌లు కూడా బీఆర్‌ఎస్‌లో చేరడం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా ఈ నియోజక వర్గంలో మైనార్టీలు అధికంగా ఉన్నందున మాజీ మంత్రి మహమ్మద్‌ ఫరీదోద్దీన్‌ తనయుడిని రాష్ట్ర పరిశ్రమల డెవల ప్మంట్‌ చైర్మెన్‌గా నియమించి మైనార్టీ వర్గాల మన్ననలు పొందేందుకు కషి చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆందోల్‌ నియోజకవర్గంలోని మరో నాయకుడికి గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌గా నియమించి అక్కడ కూడా ఓటు బ్యాంకును కాపాడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుటుంబం నుంచి ఎవరో ఒకరు జహీరాబాద్‌ నుండి పోటీ చేస్తారన్న ముమ్మర ప్రచారం కొనసాగు తోంది. ఇందుకోసం ఆ పార్లమెంటు పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రణాళిక రచిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకొని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితలు ఈ జిల్లాలో ఉన్న నాయకులతో సమన్వయాన్ని పెంచుకుంటూ పార్టీ సంక్షేమానికి కషి చేస్తున్నట్టు తెలుస్తోంది. నాయకులు మారినంత మాత్రాన ఓట్లు మారుతాయా అని పలువురు తెలుపుతున్నప్పటికీ.. ప్రజలకు సమస్యలు వచ్చిన ప్పుడు వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకత్వం ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో చివరికి గ్రామీణ స్థాయి కార్యకర్తలు సైతం బీఆర్‌ఎస్‌ నాయకుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రతిపక్ష నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిట ిసిలు, ఎంపీపీలు త్వరలోనే అధికార పార్టీలో చేరుతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. రానున్న రోజుల్లో జరుగుతు న్న రాజకీయ పరిణామాలను బట్టి ఎవరు ఎక్కడికి వెళ్తారో.. ఎన్ని కండువాలు మార్చుకుంటారో వేచి చూడాల్సిందే.