అభివృద్ధివైపే నిలబడతాం..

– టిఆర్ఎస్ అభ్యర్థికి ప్రశాంత్ రెడ్డికి  మద్దతుగా కుల సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు  
నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన నాలుగు కుల సంఘాల సభ్యులు గ్రామంలో కోట్లాది రూపాయలతో పనులు చేపట్టి, గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి కే అండగా ఉంటామని పేర్కొంటూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం గ్రామంలోని పద్మశాలి సంఘము, శాలివాహన కుమ్మరి సంఘము, అంబేద్కర్ మాదిగ సంఘము,  వీసీ తండా కేసీ తండా వాసులు ఆయా కుల సంఘాల్లో సమావేశాలు నిర్వహించుకొని చర్చించుకున్నారు. మెజారిటీ సంఘ సభ్యుల అభిప్రాయాల మేరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ప్రశాంత్ రెడ్డికి  మద్దతు ప్రకటిస్తూ, తమ ఓట్లన్నీ ప్రశాంత్ రెడ్డికే వేస్తామని పేర్కొంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. నాలుగు కులసంఘాల సభ్యులు తాము చేసుకున్న ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను జడ్పీటీసీ రాధా రాజగౌడ్ కు అందజేశారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ కోనాపూర్ గ్రామంలో మంత్రిగా ప్రశాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను గుర్తించి కుల సంఘాల సభ్యులు ప్రశాంత్ రెడ్డి వెంట ఉంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయ్య దేవయ్య ఎంపీటీసీ సభ్యుడు లకావత్ గంగాధర్, సింగిల్ విండో  చైర్మన్ బడాల రమేష్, బీఆర్ఎస్ పార్టీ  మండల ఉపాధ్యక్షులు టేకుల రాజు, మండల ఎస్టి సెల్ అధ్యక్షులు లకావత్ సంతోష్, బిఆర్ఎస్ పార్టీ  గ్రామ శాఖ అధ్యక్షులు ఉత్కం నర్సాగౌడ్, ఉపసర్పంచ్ టేకుల జలంధర్, పార్టీ నాయకులు రమేష్ రెడ్డి, జలా రాజు, గంగారెడ్డి, చిన్నరెడ్డి, శేఖర్, యూత్ నాయకులు, పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.