మా మహిళా భవనం మాకే కావాలి …

నవతెలంగాణ – ఆర్మూర్
 మా మహిళా భవనం .మాకే కావాలి అంటూ పట్టణంలోని పెర్కిట్ జాతీయ రహదారిపై సోమవారం మహిళ సంఘాల సభ్యురాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోక నిర్వహించినారు. పెర్కిట్ ,కొటార్ మోర్ లో గల గ్రామ మహిళ సంఘ భవనం ప్రహరీ గోడను ఏ లాంటి సమాచారం లేకుండా అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు .మహిళ సంఘ భవనం లో గతంలో ప్రజల సౌకర్యం కోసం ఆరోగ్య కేంద్రం సేవలకై ఒక గదిని కేటాయించటం జరిగింది. ఆ గదికి పల్లె దావకాన పేరుతో ఆరోగ్యశాఖ అధికారులు బోర్డు పెట్టుకున్నారని మహిళ సంఘాల సభ్యులు మండిపడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా ప్రహరిని కూల్చివేయడం పట్ల అధికారులపై, నాయకులపై మహిళ సంఘ సభ్యులు మండిపడ్డారు. జాతీయ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించినారు .స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కుల సంఘాలకు ,స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్న 10 శాతం స్థలాల మాదిరిగా బస్తీ దావకానకు సైతం స్థలంను మంజూరు చేయాలని కోరినారు.. మహిళ సంఘ భవనం ఆవరణలో మరో భవనం నిర్మిస్తామంటూ వస్తే ఊరుకునేది లేదని మహిళా సంఘాల అధ్యక్షురాలు రూప చేపూరు విజయ, రాజగంగులు తెలిపారు .జాతీయ రహదారిపై అరగంటసేపు మహిళలు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి పట్టణ పోలీసులు చేరుకొని సర్ది చెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో మెరుగు లలిత ,కమల ,సుజాత మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు..