
నవతెలంగాణ- డిచ్ పల్లి: ఏలాంటి అందోళన వద్దని, పార్టీ ఎళ్ళప్పుడు అండగా ఉంటుందని దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్ అన్నారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని మల్లాపూర్ లో ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు రఘునథన్ రాము ను, ఇతర నాయకులను పరామర్శించి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. గత వారం ఉప సర్పంచ్ రఘునథన్ రాము తల్లి మృతి చెందారు. దానిలో బాగంగానే గ్రామాన్ని సందర్శించి పలువురిని పరామర్శించారు. మృతికి గాల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయన వేంట సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.