పాలకుర్తిలో కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తాం

– ఈ నెల 9న యశస్విని నామినేషన్‌
– పాలకుర్తి ఇన్చార్జి ఝాన్సీరెడ్డి
నవతెలంగాణ-పాలకుర్తి
కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల సమిష్టి కషితో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పా లకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బావిలాల, సిరిసన్న గూడెం, ముత్తారం గుట్ట కింది తండా, తొర్రూరు గ్రామాలకు చెందిన బిఆర్‌ఎస్‌, బిజెపి కార్యకర్తలు ఆ పార్టీలకు రాజీనామా చేసి భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కార్యకర్తలను ఝాన్సీ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఓటమి భ యంతో యశస్వినిరెడ్డి పై అసత్య ఆరోపణలు చేస్తున్నా రని, ఎన్ని ఆరోపణలు కుట్రలు చేసిన కాంగ్రెస్‌ గెలు పును ఆపలేరని స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చా రు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తెలిపే లక్ష్యంగా ప్రతి కార్య కర్త శక్తివంచన లేకుండా కషి చేయాలని కోరారు. ఈ నెల తొమ్మిదిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి నామినేషన్‌ వేస్తున్నారని తెలిపారు. ఎర్రబెల్లి చేస్తున్న దుష్ప్రచారాలకు కుట్రలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఎదు రించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌తోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని తెలి పారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మార్పును కో రుచున్నారని, మార్పును కాంగ్రెస్‌ స్వాగతిస్తుందని తెలి పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు 26 ఏట రాజ కీయాల్లోకి వచ్చి 1993లో ఓటమి చవిచూశాడని, 26 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓట మి తప్పదని, 2023లో ఇంటి బాట పడతాడని జో ష్యం చెప్పారు.1993 ఓటమి 2023లో పునరావతం అవుతుందన్నారు. వేలకోట్ల అభివద్ధితో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తెలిపారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎన్ని జిమ్మిక్కులు వేసిన రాబోవు ఎన్నికల్లో ప్రజ ల చేతిలో ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాకి రాల హరిప్రసాద్‌, రాపాక సత్యనారాయణ, కుమార స్వామి గౌడ్‌, చిలువేరు కష్ణమూర్తి, గంగు కష్ణమూర్తి, బొమ్మగాని భాస్కర్‌, వెంగళరావుతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్త లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.