ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం..

నవతెలంగాణ – తిరుమలగిరి
బీజేపీ మేనిఫెస్టో విడుదలతో తుంగతుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలను అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ నియోజకవర్గం గా దిద్దుతామని తీర్చిదిద్దుతామని బీజేపీ నాయకులు బూర నర్సయ్య గారు అన్నారు. మండల కేంద్రంలో సోమవారం నియోజకవర్గ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ రహదారులు అనుకూలంగా చేసి మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మండలానికి ఒక ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం లేదా సైనిక స్కూల్ ఏర్పాటు చేయబడినట్లు చెప్పారు.నిరుద్యోగ యువతీ యువకుల కోసం నియోజకవర్గంలో ప్రతి ఏటా 25 వేల మంది ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. నియోజకవర్గంలోని తిరుమలగిరి, మోత్కూరు, మున్సిపాలిటీలు అభివృద్ధి కోసం 500 కోట్లతో అన్ని రకాల అభివృద్ధి చేస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, త్రాగునీటి సౌకర్యం, పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మండల కేంద్రాలలో బస్సు బస్టాండ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర నాణ్యమైన ఎరువుల విత్తనాల పంపిణీ, పత్తి కొనుగోలు కేంద్రాలు, ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడి కోసం రైతులకు శిక్షణ, శిక్షణ ప్రధానమంత్రి ఫసక్ యోజన కింద పంట నష్ట బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ అభ్యర్థి కడియం రామచంద్రయ్య, నాయకులు గాజుల మహేందర్, భూతం సాగర్, మేడబోయినా యాదగిరి, కళ్యాణ్ చందర్, దీన్ దయాల్, చిర్రబోయిన హనుమంతు, ఈదునూరు జ్యోతి, మల్కాపురి చిరంజీవి, బండారు సత్యనారాయణ, నాగయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.