వికలాంగులకు ప్రభుత్వ సహకారం అందిస్తాం

– మేడ్చల్‌ జిల్లా రెవిన్యూ అధికారి లింగ్యా నాయక్‌
నవతెలంగాణ-మేడ్చల్‌ కలెక్టరేట్‌
దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున తగు సహకారం అందిస్తామని మేడ్చల్‌ జిల్లా రెవిన్యూ అధికారి లింగ్యా నాయక్‌ అన్నారు. గురువారం మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లో వికలాంగుల హక్కుల చట్టం 2016పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం చేస్తుందన్నారు. దివ్యాంగులపౖౖె వివక్షత లేకుండా ప్రవర్తించాలని అధికారులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు మాట్లాడుతూ… దివ్యాంగుల చట్టం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమశాఖ తరపున ఉచిత సహాయోపకరణాలు, సబ్సిడీ లోన్లు అందిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ దివ్యాంగులకు ఉచిత ప్రయివేటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అడ్వైజరీ బోర్డు సభ్యులు గంగారాం, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.