నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం..

– ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ వినోద్ కుమార్
నవతెలంగాణ-ఆర్మూర్ :
ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డిఓ వినోద్ కుమార్ అన్నారు. .పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో బుధవారం డివిజన్లోని బిఎల్ఓ లకు, సూపర్వైజర్లకు, సెక్షన్ అధికారులకు ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలు ,సమావేశాలు ,ర్యాలీల అనుమతుల కోసం కనీసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని ,,80 సంవత్సరాలు దాటిన ఓటర్లు ,,ఓటరు జాబితాలో మార్పింగ్ కలిగిన దివ్యంగా ఓటర్లకు తమ ఇంటి నుంచే ఓటు వేసే విసలపాటు ఉంటుందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల ఖర్చును నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలు సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు శ్రీకాంత్,,, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.