గాదరికే మా ఓటు… మళ్ళీ గెలిపించుకుంటాం

నవతెలంగాణ- తిరుమలగిరి: తుంగతుర్తి నియోజకవర్గంలో దశాబ్ద కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చేసి సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడిన మా గాదరికే మా ఓటు అని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి మళ్లీ గెలిపించుకుంటామని తిరుమలగిరి మండల మొర్రికుంట తండా గ్రామ సర్పంచ్ ధరావత్ దేవా నాయక్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి  తెలంగాణ రాష్ట్రంలో తండాలు, ఆదివాసి గ్రామాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం 3146 తండాలు ఆదివాసి గ్రామాలను గ్రామపంచాయతీలుగా చేశారని, గిరిజనులు గృహ అవసరాల కోసం 101 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించారని అన్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో తిరుమలగిరి మండలంలో 9 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగిందన్నారు. వాటిలో మొర్రికుంట తండా గ్రామపంచాయతీ  నుండి మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ సర్పంచిగా గెలిచి గాదరి కిషోర్ కుమార్ సహకారంతో 881 జనాభా 740 ఓట్లు 8 వార్డులు కలిగిన తండాను సమృద్ధిగా అభివృద్ధి చేసుకోగలిగాను అన్నారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ సహకారంతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో తండాలో 115 మందికి ఆసరా పెన్షన్లు, 352 మందికి రైతుబంధు, రెండు కోట్ల 10 లక్షలతో బీటీ రోడ్డు, 40 లక్షలతో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్,20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం ఇవే కాకుండా ప్రకృతి వనాలు, స్మశాన వాటిక, స్వచ్ఛమైన తాగునీరు, సీసీ రోడ్లు, వీధిలైట్లు కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్సారెస్పీ కాలువల ద్వారా గోదావరి నీళ్లు మండలంలోని మా ఆవాస ప్రాంతంలోకి తొలుత ప్రవేశించడం  ద్వారా  గ్రామంలోని రైతులు పూర్తిస్థాయిలో భూములను సాగు చేసుకునే విధంగా అభివృద్ధి చేశారన్నారు. ఇలా ఒక్క తండాలోనే కాకుండా మండలంలోని  నూతన గ్రామ గ్రామపంచాయతీలుగా ఏర్పడిన ప్రతి ఒక్క తండాల్లో ఇదే తరహాలో అభివృద్ధి జరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలనే కాకుండా తండాలను సైతం గ్రామపంచాయతీలుగా మార్చి తండాల అభివృద్ధికి పాటుపడిన  గాదరికే మా ఓటు అని రాబోయే అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న మళ్లీ ఓటు వేసి మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.