అప్పుల బాధతో నేతకార్మికుడి ఆత్మహత్య

Weaver commits suicide due to debtనవతెలంగాణ-సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణంలోని పద్మా నగర్‌కు చెందిన మంగలపల్లి సాయి(32) అనే నేత కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకు న్నాడు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. నిరుపేద నేత కుటుంబానికి చెందిన సాయి.. తండ్రి లక్ష్మణ్‌ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యారు. తల్లి చిలుకమ్మ గుండెజబ్బుతో బాధ పడుతుంది. దాంతో వారి ఆరోగ్యం బాగు చేయడానికి సుమారు రూ. 10లక్షల వరకు అప్పు చేశాడు. చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక చేతినిండా పని లేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమం లో మనస్తాపానికి గురైన సాయి గురువారం మానేరు వాగులో దూకాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉష, శ్రీవాణి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. మృతుని తల్లి గుండెజబ్బుతో బాధపడుతుండటంతో సాయి మృతి విషయం ఇప్పటివరకు చెప్పలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.