ప్రజలకు సంక్షేమ పథకాలు వివరించాలి

– ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
గడిచిన పదేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథ కాల గురించి కార్యకర్తలు అందరూ ప్రజలకు వివ రించాలని ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి సూచిం చారు. బుధవారం మండలంలోని బంగ్లాపల్లి, గుడిపాడ్‌, వేములపల్లి,నర్సింగపూర్‌, మెట్టుపల్లి, మొగుళ్ళ పల్లి, మొట్లపల్లి, గణేష్‌ పల్లి,కొరికిషాల, పోతుగల్లు, ఇప్పలపల్లె గ్రామాల్లో ముఖ్య నాయ కులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమ్మే ళనం నిర్వహించారు. గత ప్రభుత్వాలు చేయలేని అభి వృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేర్చారని తెలిపారు. రైతు బంధుతో రైతు బాంధవుడుగా సీఎం కేసీఆర్‌ రైతుల గుండెల్లో నిలిచి పోయా రన్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కోసం సీఎం కేసీఆర్‌ రూపొందించిన మేనిఫె స్టోను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్ష పార్టీల వారు ఎన్ని మాయమాటలు చెప్పిన ప్రజ లు నమ్మొద్దన్నారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్య మంత్రిగా హ్యాట్రిక్‌ సాధిస్తాడాని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండదండలతో ని యోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుప డినట్లు వివరించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని తెలిపారు. ఈ సమా వేశంలో ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, జెడ్పీటీసీ జోరుక సదయ్య, చిట్యాల మార్కెట్‌ చైర్మన్‌ కొడారి రమేష్‌, బిఆర్‌ ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతి రావు, పిఏసీఎస్‌ చైర్మన్‌ సంపెల్లి నరసింగారావు,వైస్‌ ఎంపిపి రాజేశ్వర్‌ రావు,వివిధ గ్రామాల సర్పంచ్‌ లు, ఎంపిటీసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.