– ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్
ఆడిలైట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో ఆసీస్ బౌలర్లు కదం తొక్కారు. హేజిల్‌వుడ్, కెప్టెన్ కమిన్స్ నిప్పులు చెరిగే బంతులకు విండీస్ జట్టు 62.1 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూల్చింది. ఆసీస్ బౌలర్లలో సారథి పాట్ కమిన్స్, జోష్ హెజిల్‌వుడ్‌లు తలా నాలుగు వికెట్లతో చెలరేగారు. విండీస్ జట్టులో క్రిక్ మెకంజీ(50) అర్థ సెంచరీతో రాణించాడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత తొలిసారి ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన స్టీవ్ స్మిత్.. ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్.. ఆసీస్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కమిన్స్ వేసిన పదో ఓవర్లో ఆ జట్టు ఓపెనర్ చందర్‌పాల్ (6) వికెట్‌ను కోల్పోయింది. అప్పట్నుంచి క్రమం తప్పకుండా వికెట్లను నష్టపోయింది.