వాడి వేడిగా సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ- భిక్కనూర్ :
భిక్కనూరు పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం ఇరు పార్టీలకు మధ్య వాడి వేడిగా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం టిఆర్ఎస్ నాయకులకు మాత్రమే ఇస్తారా మిగతా పార్టీ వాళ్లకు ఇవ్వరా అని ప్రశ్నించారు. పథకాలు అందజేయడంలో అర్హులైన వారిని గుర్తించకుండా టిఆర్ఎస్ నాయకులు ఎవరి పేరు చెప్తే వాళ్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సదుపాయాలు, సీసీ రోడ్లు సక్రమంగా లేవని ప్రశ్నించారు. అనంతరం ఎంపీపీ గాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను గుర్తించి అర్హులైన వారికి సంక్షేమ ఫలాలను అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఏం సి చైర్మన్ హనుమంత్ రెడ్డి, ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.