– యువతకు తాయిలాల ఎర
– మందు,విందులతో ప్రసన్నం
– ఆకట్టుకునేలా పోటాపోటీ ప్రయత్నాలు
నవ తెలంగాణ: మల్హర్ రావు:
ఏం తమ్మి ఎట్లున్నవ్..ఈ సారి మన పార్టీకే ఓటేయ్యాలే.మనమే అధికారంలోకి వస్తున్నాం.నీతో పాటు మీ ఇంట్లోళ్లయి,రిలేటివ్స్,ప్రేoడ్స్ అందరి ఓట్లు మనకే పడాలే.ఎమున్న మనోళ్ళొచ్చి చూసుకుంటరు. ఊళ్ళో నువ్వే ముందుండి నడిపించేలా ఓట్లన్నీ గంపగుత్తగా మనకే పడేలా చూడాలా.సోషల్ మీడియాలో మన పార్టీని హోరెత్తించాలి..ఇలా ఏ ఊళ్ళో చూసినా ఆ పార్టీ అభ్యర్థులు ఓటర్ల మధ్య ఇవే మాటలు వినిపిస్తున్నాయి.అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థులు యువతను ఆకట్టుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.విందులు,తాయిలాలతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆరాట పడుతున్నారు.
యువతే టార్గెట్….
నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు రెబల్ గా బరిలో నిలిచిన వారు ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి సారించారు.వివిధ వర్గాల గంపగుత్త ఓట్లపై నజర్ వేశారు.ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంతోపాటు ఓట్లతో కీలకంగా ఉన్న యువతపై ఫోకస్ పెంచారు. వారిని తమ వైపు తిప్పుకొనేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు.మంథని నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్,బిజెపి,బిఎస్పీ తోపాటు రెబల్ గా 28 మంది నామినేషన్లు వేశారు.మంథని 9 మండలాల్లో మొత్తం 2,30,306 ఓట్లు ఉండగా ఇందులో 40 ఏళ్ళ లోపు యువకులు 80.245 మంది ఉన్నారు.వీరిని ఆకర్శిస్తే ప్రచారం సులువు కావడంతో పాటు ఓట్లు కలిసి వస్తాయనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది.ప్రధాన పార్టీలతోపాటు ఆర్థిక,బలంగా ఉన్న స్వతంత్ర్య అభ్యర్థులు సైతం వారిని ఆకట్టుకునేందుకు పోటాపోటీగా యత్నిస్తున్నారు.
జోరుగా విందులు,..
ఎన్నికల ప్రక్రియ పూర్తియ్యే వరకు యువత తమ వెంటే ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారిని మందు,విందుల్లో ముంచెత్తుతున్నారు.తాము కోరుకున్న బ్రాoడ్ల మద్యంతో పాటు నాన్ వెజ్ తో కూడిన డవటబ్ల్యూ ఆరెంజ్ లు చేస్తూ నిత్యం వారిని ఖుషి చేస్తున్నారు.పట్టణాలతోపాటు అన్ని గ్రామాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి.తమ వెంట తిరిగే యువత ఏమాత్రం నారాజ్ కాకుండా ఉండెలా వారికి అవసరమైన మర్యాదలు చేసేందుకు ద్వితీయ శ్రేణి నాయకులకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు.సదరు నాయకులు యువకులతో నిత్యం టచ్ లో ఉంటూ వారు ఆడిగింది కాదనకుండా సమకూర్చుతున్నారు.
తాయిలాల ఎర…
విందులతోపాటు యువతను ఆకట్టుకునెలా వివిధ రకాల తాయిలాల ఎర వేస్తున్నారు.వాహనాలను అవసరమైన ఇందనంతోపాటు,మొబైల్ ఫోన్లకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు అవసరమైన రిచార్జ్ లు చేయిస్తున్నారు.సంఘాలుగా ఉన్న యువత సేవలను వినియోగించుకునేలా క్రిడా పరికరాలను అందజేస్తున్నారు.ఎన్నికల్లో విజయం సాధిస్తే స్వయం ఉపాధికి అవసరమైన బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామని,ప్రభుత్వ పరమైన సబ్సిడీ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని భరోసా కల్పిస్తున్నారు