ఒక్క రోజులో ఏం జరిగింది?

ఇందిరా ఆర్ట్‌ క్రియేషన్స్‌ వంశీ రాజు సమర్పణలో ప్రీతి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కరోజు-48 గంటలు’. ఆదిత్య, రేఖ నిరోషా జంటగా నటిస్తున్నారు. నిరంజన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా గురించి నిర్మాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి,’సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ త్వరలోనే నిర్మాత సి.కళ్యాణ్‌ చేతుల మీదుగా రిలీజ్‌ చేస్తాం’ అని తెలిపారు. ‘డైమండ్‌ని రక్షించటానికి హీరో టైమ్‌ ట్రావెలింగ్‌ని వాడుకొని ఎలా విజయం సాధించాడు అనేది సినిమా’ అని డైరెక్టర్‌ నిరంజన్‌ చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ :వంశీ రాజు, మ్యూజిక్‌ : ప్రజ్వల్‌ క్రిష్‌, కెమెరా : చరణ్‌ అక్కల.