నయా సినిమాలు.. నయా కాంబినేషన్లు

విశ్వక్‌ సేన్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.21గా ఓ సినిమా రూపొందనుంది. ప్రసీద చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. అనౌన్స్‌మెంట్‌ నేపథ్యంలో రిలీజ్‌ చేసిన వీడియోని బట్టి చూస్తే, రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని చీకటి సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న పీరియాడిక్‌ ఫిల్మ్‌ అనిపిస్తోంది. హీరో శ్రీనివాస్‌ బెల్లంకొండ ‘భీమ్లా నాయక్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సాగర్‌ చంద్ర కాంబినేషన్‌లో ఓ చిత్రంలో నటించబోతున్నారు. మాస్‌-యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించ నున్నారు. శ్రీనివాస్‌, వి.వి.వినాయక్‌ కాంబోలో తెరకెక్కిన హిందీ ‘ఛత్రపతి’ మే 12న రిలీజ్‌ కానుంది.

Spread the love