నవతెలంగాణ- రెంజల్
బోధన్ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత తొమ్మిది సంవత్సరాల కిందట తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఏమైందని రెంజల్ బిజెపి నాయకులు పేర్కొన్నారు. బుధవారం సాటా పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు మేక సంతోష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మహిళలను బహిరంగ సభకు తరలించడానికి నాన అవస్థలు పడాల్సి వచ్చింది అని వారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, సోషల్ మీడియా బోధన్ డివిజన్ సాయినాథ్ పార్థ రమేష్, ప్రసాద్, యువత పాల్గొన్నారు.