
నవతెలంగాణ -డిచ్ పల్లి
జిల్లాలో రోడ్డు భవన నిర్మాణ శాఖా మంత్రి ఉండి కూడా జిల్లాకు ఎలాంటి ఉపయోగం లేదని, నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించాడానికి ముఖ్యమైన మార్గం మాధవనగర్ అని త్వరగా రోడ్డు మార్గాన్ని నిర్మించే విధంగా చూడాలని, ఫ్లైఓవర్ పనులు నత్తనడకన పనులు కోనసాగుతున్నాయని వేంటనే తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేసి పనులను పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ నీయోజక వర్గ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.గురువారం డిచ్ పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని మాధవనగర్ సాయిబాబా ఆలయం వద్ద కురిసిన వర్షానికి రహదారి కొట్టుకుపోయిన విషయాన్ని తెలుసుకొని పరిశిలించారు. అనంతరం అర్&బి ఎస్ సి తో మాట్లాడి త్వరగా ఈ పనులు వేగవంతంగా చేయాలని డిమాండ్ చేశారు.అయన వేంట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి, టిపిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, రూరల్ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్,అనిల్ రెడ్డి, వినోద్, ఆనంద్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.