దళిత బంధు అక్రమాలను ఎత్తి చూపితె తప్పేంటి?

అడ్వకేట్‌ ఉపేందర్‌పై దాడి అమానుషం : షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దళిత బంధు అక్రమాలను ఎత్తిచూపినందుకే అడ్వకేట్‌ ఉపేందర్‌పై అమానుషంగా బీఆర్‌ఎస్‌ గుండాలు దాడి చేశారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘బీఆర్‌ఎస్‌’ అంటే ‘బంధిపోట్ల-రాష్ట్ర-సమితి’ అని పేర్కొన్నారు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి బీఆర్‌ఎస్‌ సంస్కారాన్ని ప్రదర్శించుకున్నారని విమర్శించారు.దళితుల హక్కుల కోసం వైఎస్‌ఆర్‌టీపీ పోరాడుతున్నదని తెలిపారు.