జమిలిపై ఏం చేద్దాం..!

What should we do about Jamili..! కోవింద్‌తో అమిత్‌ షా, న్యాయ శాఖ మంత్రి మేఘ్వాల్‌ భేటీ ..మొదటి సమావేశంపై చర్చ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
జమిలి ఎన్నికలపై కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ కలిశారు. బుధవారం రామ్‌నాథ్‌ కోవింద్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రభుత్వం ప్యానెల్‌ను నోటిఫై చేసిన కొద్ది రోజుల ఈ భేటీ జరిగింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశాన్ని నేతలు మర్యాదపూర్వక భేటీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసి వేదికను ఖరారుపై చర్చించారు. భవిష్యత్తులో సమావేశాలు కూడా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించవచ్చని తెలిపారు. ప్యానెల్‌కు సహాయం చేసే, సెక్రెటేరియల్‌ సహాయం అందించే అధికారులను నామినేట్‌ చేసే ప్రక్రియలో న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నట్టు తెలిసింది.లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించే అంశంపై పరిశీలించి సిఫారసులు చేయడానికి ప్రభుత్వం రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీకి నోటిఫై చేసిన విషయం విదితమే.