– 24 గంటలు కరెంట్, రూ.2లక్షల రుణమాఫీ
– కాంగ్రెస్ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల
నవతెలంగాణ-మల్హర్‌రావు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 24 గంటల కరంట్,రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు అవుతుందని జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి, తెలం గాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. మండ లంలోని మల్లారం, రావులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అధికంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన గ్యాస్ ధరలు, పెరిగిన బస్సు చార్జీల నుండి ఉపశమనం కలిగించడానికి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రూ.2,500 అందజేస్తామన్నారు. రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకం ద్వారా ఏటా రైతులకు,కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు.రూ.12,000, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్.ఇస్తుందన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఇంది రమ్మ ఇళ్లు పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం ఇవ్వడం జరుగు తుందన్నారు. యువ వికాసం పథకం ద్వారా పేద విద్యా ర్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తా మన్నారు. ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్‌తోపాటు చేయూత ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్,పేదలకు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా అమలు చేస్తామని అన్నారు. మల్లారం గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కారం చేయడంలో పాలకులు విపలమైయ్యారని ఎంపిపి చింతల పల్లి మలహల్‌రావు విమర్శించారు.
ప్రతి కార్యకర్త సైనికునిలా పని చేయాలి
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలని తెలంగాణ మేనిపేస్టో చైర్మన్, మంథని కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు కండువాలు కప్పి ఆహ్వానిం చారు. తాడిచెర్ల నుంచి వార్డు సభ్యురాలు తమ్మిశెట్టి పద్మ తోపాటు 30మంది, ఎడ్లపల్లి గ్రామంలో 20 మంది, పెద్దతూండ్ల నుంచి 20మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంథని అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ మేనిపేస్టోలోని ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు వారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, జిల్లా అధ్యక్షుడు ప్రకాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, ఎంపిటిసి ప్రకాష్ రావు, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాంతి, మల్లారం వార్డు సభ్యుడు లింగన్నపేట శ్రీదర్,సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, గ్రామ యూత్ అధ్యక్షుడు లింగన్నపేట రమేష్, లింగయ్య,మాధవరావు, రూపేస్‌రావు మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ చెంద్రయ్య, నాయకులు బొబ్బిలి రాజు గౌడ్,కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్,రాజయ్య,రాజా సమ్మయ్య పాల్గొన్నారు.
హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా
కాటారం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంపటి హమాలి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ జిల్లా శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం ప్రచా రంలో భాగంగా గారెపల్లి హమాలీ సంఘం వద్ద కార్మికులు గుమకూడి ఉండడం చూసి వారితో యోగక్షేమాలు తెలుసుకొని హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు, హమాలీలు ఎదుర్కొంటున్న సమ స్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షులు వేమునూరి, ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు,, కాటారం ఉపసర్పంచ్ నాయి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గద్దె సమ్మిరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్, చీమల వెంకటస్వామి, చీమల రాజు, పసుల మొగిలి తదితరులు పాల్గొన్నారు.