గీత వృత్తి “రాత” మారెదెప్పుడు

– బీనవేని రవి గౌడ్ రామగుండం మండల అధ్యక్షుడు
నవతెలంగాణ- యైటింక్లైన్ కాలనీ: గ్లోబలైజేషన్తో మానవజాతి కొత్తపుంతలు తొక్కుతూ నవీన పోకడలవైపు అడుగులేస్తున్న తరుణంలో సహితం “గీత” వృత్తి మాత్రం ఆధునీకరణకు నోచుకోవడం లేదని గౌడ సంక్షేమ సంఘం రామగుండం మండల అధ్యక్షుడు భీనవేని రవి గౌడ్ అన్నారు. వ్యవసాయంతో సహ దాదాపు అన్ని కులవృత్తులు సులభతరంగా, ప్రమాదరహితంగా మార్పుచెంది కొత్త పరికరాలతో పరుగులు తీస్తున్న నేటి తరుణంలో ఇంకా పాత రాతియుగం నాటి పరికరాలకు “కల్లు గీత” వృత్తి పరిమితం అయింది. కేవలం || తెలంగాణకే పరిమితమైన కల్లు గీత వృత్తికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదరణ లభించక పోవడంతో ప్రత్యేక తెలంగాణలోనైన మా బ్రతుకులు. మారుతాయని భ్రమించిన గీత కార్మికుల రాతలు నేటికి మారడం లేదు. కాళ్లకు గుజి, చేతులకు మోకు, నడుంకు ముస్తాదుతో ఆకాశాన్ని అంటి ఉన్న తాటిచెట్టును పాకుతూ ప్రమాదాలు కొనితెచ్చుకోవడం పరిపాటిగా మారింది. గతంలో మాదిరిగానీ గడిచిన ఎనిమిదేళ్లలో 620 మంది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా దాదాపు 400 మంది వికలాంగులుగా మారినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 4558 కల్లు గీత సహకార సంఘాలలో 2.30 లక్షల మంది సభ్యులుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అరచేతులో ప్రాణాలు పెట్టుకొని బ్రతుకులు వెల్లదీస్తున్న గీత కార్మిక వృత్తికి మోక్షం ఎప్పుడు లభిస్తుందోనని ఎదురు చూస్తున్నారు.